బాపట్లలో శనివారం ‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ ఘనంగా జరిగింది. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగల సందర్భంగా పాస్టర్ల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఎఫ్.డబ్ల్యు.కోల్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ దయ, ప్రేమ, కరుణతో మెలగాలని ఆయన సూచించారు. సూర్యలంక వద్ద మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఉత్సాహంగా సాగింది.