ELR: జీలుగుమిల్లి మండల పరిధిలో వజ్ర ప్రహర్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఉన్న పాతబడిన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, బస్ షెల్టర్లను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.