ELR: రైలు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సీతంపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దెందులూరు-భీమడోలు మధ్య పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు దృవీకరించారు. మృతురాలు 70 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసినవారు రైల్వే హెచ్‌సీ ప్రసాద్‌ను సంప్రదించాలని కోరారు.