AKP: వచ్చే నెల 2వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియనున్న సందర్భంగా గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచులకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైస్ ఎంపీపీలు ఆదినారాయణ, జక్కు నాగమణి పాల్గొన్నారు.