ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీల బదిలీలలో భాగంగా ఈ నియామకం చేపట్టారు. ప్రస్తుతం వైజాగ్ క్రైమ్ బ్రాంచ్లో విధులు నిర్వర్తిస్తున్న బాలమురళీకృష్ణకు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.