VZM: ఫేస్బుక్ పరిచయంతో వ్యక్తిని నమ్మించి, దాడి చేసి దోచుకున్న నలుగురు నిందితులను జామి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాండ్రంకి ఉష మాటలు నమ్మి అలమండ సంతకు వచ్చిన వ్యక్తిపై పాండ్రంకి కిరణ్, ఉష, బోని యేర్నిబాబు, పాండ్రంకి ప్రసాద్ దాడి చేసి బంగారు గొలుసు అపహరించారు. నిందితుల నుంచి 18 గ్రాముల గొలుసు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ASP సౌమ్యలత తెలిపారు.