కర్నూలు జిల్లా గోల్ షూట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా హుసేనాపురం వాసి బోయ నరేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రియ శనివారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో క్రీడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నరేష్ కుమార్ తెలిపారు.