E.G: లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం రాజమండ్రిలోని జిల్లా కోర్టు ఆవరణలో మహిళా సాధికారత, హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుటుంబం, సమాజంలో మహిళలు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమన్నారు.