CTR: వీ.కోట మార్కెట్లోని మండీల వద్ద ఉంచిన క్రేట్లను కొంతమంది తరచూ దొంగలించుకుపోతున్నారు. దీంతో అనుమానం వచ్చిన యజమానులు స్క్రాప్ దుకాణాల్లో విచారించారు. ఓ దుకాణంలో సుమారు 500 క్రేట్ల దాకా కనుగొని యజమానిని నిలదీశారు. ప్రతి రోజు ఎవరో ఒకరు 5, 10 క్రేట్లు తెచ్చి విక్రయిస్తుంటారని సమాదానం ఇచ్చాడు.