కోనసీమ: అమలాపురం మండలంలోని పాలగుమ్మి గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను శనివారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా సకాలంలో లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.