SS: పెనుకొండ నియోజకవర్గ డివిజన్ కార్యాలయంలో రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. విద్యుత్ సమస్యలపై అధికారులు గ్రామస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.