PLD: నరసరావుపేట నాగూర్ వలి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. బైక్‌పై అతివేగంగా వెళ్లి ముందున్న కారును ఢీకొట్టడంతో ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమచారం. అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.