KRNL: ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.