AKP: తాను అభ్యసించిన తెలుగు భాష ద్వారా ఐపీఎస్ సాధించగలిగానని యూపీ రాష్ట్రం మాజీ ఎడిషనల్ డిజిపి కిల్లాడ సత్యనారాయణ సోమవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు నాలుగు సార్లు రాస్తే మెయిన్స్‌లో ఫెయిల్ అవ్వడం జరిగిందన్నారు. ఐదోసారి తెలుగులో రాసి ఐపీఎస్ కి ఎంపిక అయ్యానన్నారు. మన భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమైనది అన్నారు.