NDL: కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో అన్యాయం జరిగితే సహించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు హెచ్చరించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సాగుతున్న పంటలను మంగళవారం పరిశీలించారు. పరిశ్రమల నీటిపై చూపే శ్రద్ధను రైతులపై చూపడం లేదని విమర్శించారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.