కోనసీమ: అమలాపురం మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరంకు చెందిన కూచిపూడి నృత్య నికేతన్ నాట్య చారిణి వై కళ్యాణి మాధవి, అమలాపురం శిష్య బృందం నాట్యం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.