అన్నమయ్య: మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోనూ ఇక్కడ ఎస్సైగా పనిచేయడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.