ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యుఎఫ్ఓ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా'(O saathiya Movie) రూపొందింది. ఆ మూవీలో ఆర్యన్ గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తన్వికా, జశ్వికా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తోంది. చందన కట్టా, సుభాష్ కట్టాలు ‘ఓసాథియా’ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించారు. జూలై 7వ తేదిన పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది.
‘ఓ సాథియా’ ట్రైలర్:
తాజాగా ‘ఓ సాథియా’ మూవీ(O Saathiya Movie) నుంచి మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ మూవీ ట్రైలర్ ను విడుదల(Trailer release) చేశారు. ఈ మూవీని యుఎఫ్ఓ సంస్థ రిలీజ్ చేస్తోంది. హీరో ఆర్యన్ మాట్లాడుతూ..విజయవాడ కృష్ణలంకలో పుట్టి హీరో అవ్వాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చానన్నారు. 9 ఏళ్ల తర్వాత అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుని పూర్తి స్థాయిలో హీరో అయ్యానని అన్నారు. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని తెలిపారు.