బాలీవుడు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను కంగనా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో మూవీ కథ సాగుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో కంగనా డెంగ్యూ బారిన పడింది. సినిమా కోసం తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టింది. తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ఆమె పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో తాను తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి సినిమా చేసినట్లు తెలిపింది. తాను శారీరకంగా, మానసికంగా అనేక కష్టాలు పడినట్లు తెలిపింది.