NGKL: హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఆదివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కాలువ పనులు వెంటనే ప్రారంభించి, వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.