SRCL: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారించగలుగుతారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య శిబిరం ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు.