SS: అటవీ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు. బుక్కపట్నం మండలం గూనిపల్లి, సిద్ధారాంపురం పరిసరాల్లో సాంకేతికతతో పర్యవేక్షణ నిర్వహించారు. అనుమానాస్పద కదలికలు, అక్రమ మార్గాలను గుర్తించి రికార్డు చేశారు. నేరాలను అరికట్టేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.