SRCL: చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, నువ్వులు, మామిడి కాయలు నేల రాలిపోయాయి. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.