RR: చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి చంద్రకళమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.