KDP: దువ్వూరు మండలం సలవాస పల్లె గ్రామంలో వాటర్ ప్లాంట్, ఆర్ బి కే, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, ఆరోగ్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ముత్యాల రామ్ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.