NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడింది. దీనితో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళుతున్న రైల్వే పాల ట్యాంకర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీనితో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పలు రైళ్లకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.