PPM: పీ-4 అమలులో ఉత్తమ ప్రతిభ కనపరచిన జీకే వీధి మండలం ధారకొండ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురుజు ప్రసాద్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. సోమవారం పాడేరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఆయన పలువురు పేదలకు పలు సేవలు అందించారు.