WNP: కొత్తకోట పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక అంచనా బడ్జెట్ను మున్సిపల్ ఛైర్మన్ అరుణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సొంత ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.