GDWL: జిల్లాలో ఎండలు 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యత అని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.