మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు.