PLD: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కారంపూడి మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ సంస్కరణలను గుర్తుచేశారు.