GDWL: అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఉప్పల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.