AKP: ఎన్టీ రామారావు రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నక్కపల్లి మండలం బోదుగల్లంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ పీవీ సూర్యారావుని సత్కరించారు.