KRNL: ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో ఏప్రిల్ 1 వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త రాఘవేంద్ర చౌదరి ఇవాళ తెలిపారు. రాష్ట్రంతో పాటు యానాం ప్రాంతాల వైపు నుంచి దిగువ దక్షిణ-పశ్చిమ గాలులు వీచనున్నట్లు వెల్లడించారు. రైతులు వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని పంటల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.