E.G: పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ నుంచి కొందరికి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా శాఖ కోరింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, చంటిబిడ్డల తల్లులు, దూర ప్రాంతాల మహిళా ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. శనివారం డీఈఓ కె.వాసుదేవరావును కలిసి జిల్లా అధ్యక్షుడు ఈవీవీఎస్ఎస్ఆర్ ప్రసాద్ వినతిపత్రం సమర్పించారు.