సత్యసాయి: పరిగి మండలంలోని వెలుగు కార్యాలయంలో 14 పంచాయతీల యానిమేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని యానిమేటర్లకు దిశానిర్దేశం చేశారు.