NRPT: విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, లక్ష్య చేధనకు నిరంతర సాధన చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం ఆయన మద్దూరు మండలంలోని పెదిరిపాడ్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, స్టాక్ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.