HNK: భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. వచ్చే శనివారం నాటికి పురోగతి వివరాలు సమర్పించాలని సూచించారు. సాగునీటి కాల్వల కోసం అవసరమైన భూముల పెగ్ మార్కింగ్ పనులు రేపటి నుండి ప్రారంభించాలని తెలిపారు. నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ఏర్పాటు కోసం అవసరమైన భూములను గుర్తించి సేకరించాలన్నారు.