నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని బాధలా పురం వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలంలోనే అధిక రక్తస్రావం కావడంతో బాధితుడు మరణించినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని మృతదేహాన్ని తరలించింది.