KMM: తల్లాడ మండలంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను ఈనెల 31న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తల్లాడ తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 59.94 టన్నుల ఇసుక ఒక క్యూబిక్ మీటరుకు రూ.642గా ధర నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.25,000 ధరావత్తు ముందుగా చెల్లించాలని తెలిపారు.