ATP: కళ్యాణదుర్గం MLA అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కోసం తాను చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని, దానికి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. పేదలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.