NRPT: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు వర్కూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. భవనానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.