NGKL: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఫేమస్. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కొల్లాపూర్ మామిడి పండ్లకు మంచి క్రేజ్ ఉంది. కొల్లాపూర్లో బంగినపల్లి, తోటపురి తదితర రకాలు ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారు. 120 ఏళ్ల కిందట సురభి వంశ రాజులు ఇక్కడ మామిడి తోటలను ప్రారంభించారు.