NLR: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్, ఏసీ నగర్లో ఉన్న వీధి శునకాలను ఏబీసీ సెంటర్‌కు తరలించారు. నగరంలో కుక్కల బెడద ఎక్కువ అవ్వడంతో పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు కమిషనర్ వై.ఓ. నందన్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తక్షణమే 10 వీధి శునకాలను పట్టుకుని ఏబీసీ సెంటర్‌కు తరలించారు.