E.G: స్వచ్ఛ భారత్కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.