VSP: పెదవాల్తేరు వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు పండితులు సూర్యనారాయణ శర్మ తెలిపారు. గణపతి పూజ, మండప ఆరాధనతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రధానంగా స్వామివారికి నిర్వహించే కిరీట మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.