ELR: ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది శేషుబాబు,సెక్యూరిటీ గార్డు సతీశ్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 61 నకిలీ టికెట్లు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.