ప్రకాశం: కంభంలోని పరీక్ష కేంద్రాలను ఎస్సై శివకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.