బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రముఖ యానిమేషన్ పాత్ర ‘ఛోటాభీమ్’ను రంగంలోకి దించింది. HYDకి చెందిన గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ సంస్థ ‘చునావ్ కా పర్వ్.. పశ్చిమ్ బెంగాల్ కా గర్వ్’ నినాదంతో ఈ ప్రచారాన్ని రూపొందించింది. ఏప్రిల్ 23, 29న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం.