ATP: అనంతపురం కలెక్టరేట్లో ఈ నెల 31న జర్నలిస్టుల కోసం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఏ.బాలకొండయ్య తెలిపారు. మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగే ఈ శిబిరంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు.